Sunday, February 2, 2014

శ్రీ గురు గీత ప్రవచనములు

జయ గురు దత్త                                                                                                              శ్రీ గురు దత్త



     శ్రీ గురు గీత - ప్రవచనములు








జయ గురు దత్త
అఖండ మండలాకారం, వ్యాప్తం ఏన చరాచరం - తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః
అనాద్యాఖిలద్యాయ మాయినే గతమాయినే - అరూపాయ స్వరూపాయ శివాయ గురవే నమః
ధ్యాన మూలం గురొర్మూర్తి   పుజామూలం గురో పదం మంత్రమూలం గురోర్వాక్యం, మోక్ష మూలం గురో కృపా


  ఇది పరమ శివుడు జగన్మాత పార్వతీ దేవికి శ్రీ గురుగీత ను అనుగ్రహిస్తూ చేసిన ఉపదేశ వ్యాఖ్యలు. ఇవి సద్గురు తత్వాన్ని తెలిపే పరమ మంత్రాలు. అంతటి మహత్తరమైన శ్రీగురుగీతను  నేటి తరాలకు అందించాలనే సత్సంకల్పంతో అవధూత దత్త   పీటాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అనేక వ్యయ ప్రయాసలకోర్చి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సరళమైన భాషలో వీనుల విందుగా మనకు అందించేందుకు రికార్డింగ్ చేయటం జరిగింది. వారి సంకల్పాన్ని సాకారం చేస్తూ E TV వారు తమ E TV తెలుగు ఛానెల్ ద్వారా ప్రతి రోజూ ప్రసారం చేసే ఆరాధన కార్యక్రమంలో ఉదయం గం: 06:20 ని లకు పూజ్య శ్రీ స్వామీజీ వారిచే ప్రవచించబడిన శ్రీగురుగీత వ్యాఖ్యానం / వివరణ మనకు అందిస్తున్నారు. ఈ సంవత్సరం శ్రీ దత్త జయంతి (17-12-2013) నుండి దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రసారమయ్యే ఈ ప్రవచనాలపై సంవత్సరం చివరలో శ్రీ స్వామీజీ వారు ఒక ప్రత్యేక ప్రశ్నావళి / క్విజ్ పోటీని నిర్వహించి విజేతలకు విశేష అనుగ్రహాన్ని అందించనున్నారు. కనుక ప్రతివారూ ఈ శ్రీగురుగీత ప్రవచన కార్యక్రమాన్ని తప్పక చూసి తరించాలని మరియు క్విజ్ పోటిలో పాల్గొని సద్గురు కృపకు పాత్రులు కాగలరని మనవి. ఒకవేళ ఎప్పుడైనా మనం ఈ కార్యక్రమాన్ని చూడలేకపోయినా లేదా మళ్ళి వివరంగా చూడాలని భావించినా ఈ కార్యక్రమ రికార్డింగ్ లను ఇంటర్నెట్ ద్వారా  YOUTUBE నందు E TV తెలుగు ఇండియా ఛానల్ లో కూడా చూడవచ్చు. మీ అభిప్రాయాలను స్పందనలను , అక్కడే పోస్ట్ కూడా చేయవచ్చు . ఆ విధానం తెలియని వారు , మైసూరు దత్త పీటంనకు, E TV వారికీ పోస్ట్ ద్వారా స్వయంగా తెలియ చేయవచ్చు. ఆ చిరునామా :

Sri Guru Gita, SGS Ashrama, Datta Nagar, Ooty Road, Mysore- 570025 
Aradhana, ETV Telugu, ETV Network, Ramoji Film City, Hyd - 501 512

సద్గురు దేవులు అందిస్తున్న ఈ విశేష అనుగ్రహాన్ని మనమందరం వినియోగించుకోగలగటం మన అదృష్టం. కాబట్టి తప్పక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాము.