గురుపాదము గురుపాదము
శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యా
మగస్త్య రేఖాదిభి రంచితాభ్యామ్
నిగూడ బీజాక్షర ముద్రితాభ్యాం
నమో నమ స్సద్గురు పాదుకాభ్యామ్
పల్లవి:
గురుపాదము
గురుపాదము
గురుదత్త
పాదము మాకు శరణం
అనుపల్లవి:
గురుదత్త
పాదము దత్త గురుపాదము
దత్త
దత్త పాదము నిత్యసత్య పాదము
చరణం:
బ్రహ్మ
లోకమందు తత్వబోధ మిచ్చు పాదము
ఇంద్రలోకమందు
భోగభాగ్య మిచ్చు పాదము
మనుజలోకమందు
వాంఛితార్థమిచ్చు పాదము
భక్త
లోకమందు కృపాసుధల నిచ్చు పాదము …1
బ్రతుకులోన
తారసిల్లి భక్తి పెంచు పాదము
ఇంటింటికి
తిరిగి తిరిగి హితము పంచు పాదము
హృదయమందు
కొలువుదీరి వెలుగుచున్న పాదము
సహస్రారచక్రమందు
వెన్నెలైన పాదము …2
శిరసుమీద
నిర్మాల్యపు పుష్పమైన పాదము
గుండెమీద
రుద్రాక్షల మేరుపూస పాదము
మనసులోన
మరుపెరుగని ధ్యానధార పాదము
జీవితాన
అందివచ్చు పుణ్యఫలము పాదము …3
రేణుకాంబ
బ్రహ్మకొరకు చూపియున్న పాదము
తన కుమారు నొప్పచెప్పి తృప్తిపడిన పాదము
సూర్యరోగహతికి
సిద్ధిమూలికైన పాదము
తనకభిన్న
శక్తియనుచు చాటియున్న పాదము …4
తపోదృష్టి
చెరువునెల్ల తూరుపారబట్టిరి
సంజవేళ
ముల్లోకపు మూలలెల్ల చుట్టిరి
మునులు
సురలు గూడ జాడ పట్టలేక
పోయిరి
ఇదిగిదిగో
నా యెదలో దాగె దత్తపాదము …5
సర్వపూజ
సారము-దత్త సద్గురు పాదము
వాంఛసంగ
త్యాగము-దత్త సద్గురు పాదము
వృత్తిసంధుల
భాగము-దత్త సద్గురు పాదము
సచ్చిదానందా ఖండము-దత్త సద్గురు పాదము …6
No comments:
Post a Comment